తాళ్లూరు మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తూర్పుగంగవరం, విఠలాపురం, మాధవరం, బొద్దికూరపాడు, బెల్లం కొండ వారి పాలెం, సోమవరప్పాడు లతో పాటు పలు దేవాలయాల్లో ఉభయ దాతల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు. తూర్పుగంగవరం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు.

