సికింద్రాబాద్, మే 22,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో శివ అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తిపై బండరాయితో మోది కర్రతో కొట్టి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు .మరణించిన వ్యక్తి గురించి ఆధారాలు లభించలేదని తెలిపారు..ఈస్ట్ మారేడు పల్లికి చెందిన శివ అనే వ్యక్తి జానీ వైన్స్ వద్ద మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తితో గొడవ పడినట్లు పోలీసులు తెలిపారు.గొడవ అనంతరం ఆగ్రహానికి లోనైన శివ తనతో గొడవపడిన వ్యక్తిని హతమార్చాలని భావించి జే కే ఫర్నిచర్స్ వద్ద పడుకొని ఉన్న అతనిపై బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన అనంతరం మల్కాజ్ గిరిలో సాయిబాబా దేవాలయంలో 2 సింహ ద్వార విగ్రహాలను అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుడుని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. శివ పై గతంలో తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనం కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. దేవాలయాలలో దొంగతనాలను ప్రవృత్తిగా మార్చుకొని శివ కాలం వెళ్లదీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుండి సాయిబాబా దేవాలయంలో దొంగలించిన రెండు సింహద్వారాలను స్వాధీనం చేసుకున్నారు.
