హైదరాబాద్ మే 24(జేఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
హైదరాబాద్ లోని యువత, మహిళలకు ఉద్యోగ, ఉపాధికి సంబంధించిన స్కిల్స్ లేకపోవడం వల్ల బయటివారికి ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని, ఇప్పటికే తమ ఆధ్వర్యంలో బర్కత్ పురాలో ఓ స్కిల్ సెంటర్ లో మహిళలకు శిక్షణ ఇస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.శనివారంసికింద్రాబాద్ నియోజకవర్గంలోని రత్నానగర్, సజ్జానగర్ బస్తీల్లో పర్యటించారు. అక్కడి నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను పరిశీలించారు.
అనంతరం మీడియాతో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడారు.ముఖ్యంగా స్కిల్స్ లేకపోవడం వల్లే స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదని బయటి ప్రాంతాల వారు నగరంలో ఉద్యోగాలను దక్కించుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వం, నాయకులు, అధికారులు
ఈ విషయాన్ని గమనించి యువకులు, మహిళలకు అత్యధిక సంఖ్యలో స్కిల్స్ సెంటర్ల ద్వారా శిక్షణా నైపుణ్యాలను పెంపొందిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకే దక్కుతాయన్నారు. హైదరాబాద్ లో ఉద్యోగాలు అధికంగా ఉంటాయని తెలిపారు. స్కిల్స్ లేమి వల్ల స్థానికులకు ఈ ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. యువత, మహిళలుకూడాతమలోనినైపుణ్యాలను పెంచుకోవడంలో ప్రాధాన్యతనీయాలని చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
తద్వారా ఆర్థికంగా కూడా పటిష్టం అవుతారని మంత్రి చెప్పారు. రత్నానగర్, సత్య నగర్ లలో చేపడుతున్న కమ్యూనిటీ హాల్ లనిర్మాణాలను పరిశీలించానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రత్నానగర్ లో ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టానని చెప్పారు. ప్రస్తుతం బస్తీ జనాభా పరంగా విస్తరించినందున మరో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారని నిర్మాణ పనులను పరిశీలించానని చెప్పారు. ఈ బస్తీల్లో కమ్యూనిటీ హాళ్లు, బస్తీ దవాఖానాలు, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో నిధులను త్వరితగతిన కేటాయిస్తే సదుపాయాల కల్పనలో వేగం పెరుగుతుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.





