ప్రభ్రుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు గత సంవత్సరం మంజూరు చేసిన ఉపకార వేతనాలు కళాశాలకు చెల్లించారో లేదో అన్న విషయాన్ని సర్వే నిర్వహించాలని ప్రకాశం జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, నోడల్ అధికారి లక్ష్మా నాయక్ కోరారు. 2023-24 విద్యాసంవత్సరం నకు సంబంధించి కళాశాలకు మంజూరు అయిన ఉపకార వేతనం ను ఒకటి మార్చి 2024న ఎస్సీ విద్యార్థులకు వారి ఖాతాల యందు, ఎన్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు జాయింట్ ఖాతాల జమ చేసినట్లు చేసినట్లు తెలిపారు. అయితే మంజూరు అయిన నిధులను 2023-24 విద్యాసంవత్సరం నకు కళాశాలకు చెల్లించారో లేదో అన్న విషయాలను జ్ఞాన భూమి యాప్ లో వేల్ఫేర్ అసిస్టెంట్స్, వార్డు ఎడ్యుకేషనల్ డేలా ప్రాసెసింగ్ సెక్రటరీలో సర్వే నిర్వహించి జ్ఞాన భూమి పోర్టల్లో ఈనెల 28 లోపు నమోదు చెయ్యాలని కోరారు.
విద్యార్థుల స్కాలర్ షిప్ ల వివరాలు పోర్టల్లో నమోదు చెయ్యాలి -ప్రకాశం జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, నోడల్ అధికారి లక్ష్మా నాయక్
26
May