తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడం అభినందనీయం…..దేశం లోనే మొదటి సారి నిర్ణయం తీసుకున్న రాష్ట్రం తెలంగాణా.ఇది ఒక మైలు రాయి…..మంత్రి సీతక్క.

హైదరాబాద్ మే 26(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం దేశంలోనే ప్రధమమని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే ఒక మైలురాయని ఆమె పేర్కొన్నారు. హైదరాబాదులో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా వారు చేస్తున్న విధులు అందరినీ సంతృప్తి పరిచాయని ఈ సందర్భంగా తాను వారిని అభినందిస్తున్నాఅన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయని ఆమె తెలిపారు. ట్రాన్స్ జెండర్ వర్గానికి అంగవైకల్య కోటా కింద ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికే మైత్రి క్లినిక్ ఏర్పాటు చేశామని ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా వారికి మరిన్ని అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ట్రాన్స్ జెండర్ వర్గానికి సమాన అవకాశాలు కల్పించి అందరినీ సమాజంలో భాగం చేయడమేనని మంత్రి స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారి అనిత రామచంద్రన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర చర్యకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తుందన్నారు. వివిధ రాష్ట్రాల నుండి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు.
ఈ పైలట్ ప్రాజెక్టు నివేదిక సమర్పించిన తర్వాత ఇతర ప్రభుత్వ శాఖలలో మరియు జిల్లాల్లో కూడా ట్రాన్స్ జెండర్లను నియమించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆమె తెలిపారు.హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిసెంబర్ నెలలో కేవలం పది రోజులలో ట్రాన్స్ జెండర్ నియామక ప్రక్రియ పూర్తి చేసి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించమని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ విభాగంలో 38 మంది ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. గత ఆరు నెలల్లో వారిపై ఒక చిన్న ఫిర్యాదు కూడా రాలేదని ఆయన గర్వంగా తెలియజేశారు. మీరు దేశానికి మార్గదర్శకులుగా నిలుస్తారని ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పిస్తూ ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో మన తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తుందని అన్నారు.ఇతర ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాలు చేస్తామంటే సహాయ పడతామని వారికి ఇచ్చిన ఉద్యోగాన్ని మంచి పేరు వచ్చే విధంగా బాధ్యతతో చేస్తే ప్రభుత్వం కూడా మరింత ప్రోత్సహిస్తుందని ఆయన సూచించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సహకరించి సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నందుకు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ ట్రాఫిక్ అసిస్టెంట్లు పోలీస్ స్టేషన్ లోని సిబ్బందితో కలిసికట్టుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డ్యూటీ విషయంలో కూడా వారు వెనకడుగు వేయకుండా విధులు నిర్వహిస్తున్నారని ట్రాఫిక్ బందోబస్తు డ్యూటీలను కూడా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వీరు సమాజంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చారని ట్రాఫిక్ విధులను సునాయాసంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్లు మరియు ఎన్జీవో సభ్యులు మాట్లాడుతూ గత 76 సంవత్సరాల నుండి ఎవరు ఎవరిని గుర్తింపును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాము ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని తోటి పోలీస్ సిబ్బంది కూడా తమతో మర్యాదగా ఉంటారని వారితో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో గౌరవంగా ఉందని అన్నారు. ఒకప్పుడు పోలీసులంటేనే చాలా భయపడే వారమని ఇప్పుడు వారితో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. అప్పుడు తమ జీవితాల పై తమకు విరక్తి కలిగేదనీ, అటువంటిది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన తమకు చాలా ధైర్యం వచ్చిందని సమాజంలో గౌరవం పెరిగిందని అన్నారు. తమకు కూడా ఇతర హోంగార్డులకు ఉన్న సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు యూనిఫామ్ విషయంలో తమకంటూ ప్రత్యేక రంగు యూనిఫామ్ ఇవ్వకుండా హోంగార్డులకున్నదే ఇవ్వడం ద్వారా తమను కూడా సమానంగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *