ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కారించాలి-జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్-పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీకోసం) కార్యక్రమంకు 73 ఫిర్యాదులు

ప్రజా పిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీ కోసం) కార్యక్రమమును జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదుదారులు వారి యొక్క సమస్యల గురించి స్వేచ్ఛగా జిల్లా ఎస్పీ కి మరియు పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. ఎస్పీ పిర్యాదులు గురించి సమగ్రంగా అడిగి తెలుసుకొని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.అందిన ఆయా ఫిర్యాదుల గురించి సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఆయా ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, త్వరితగతిన పరిష్కారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదిక కూడా ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం కొరకు పోలీసు స్టేషన్లు/కార్యాలయాలకు వచ్చు పిర్యాదుదారులతో పోలీసు అధికారులు మరియు సిబ్బంది మర్యాదగా వ్యవహరించి చట్ట పరిధిలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. మీ కోసం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
తన వాట్సప్ నెంబర్ కు ఒక మెసేజ్ వచ్చిందని కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి టెలిగ్రామ్ లో గేమ్ ఆడితే మనీ గెలవవచ్చునని ఆశ చూపి, విడతల వారీగా రూ.1,15,000/-లు వారి యొక్క అకౌంటు మరియు ఫోన్ పే లకు డబ్బులు చెల్లించగా ఇంకా డబ్బులు కడితే మొత్తం డబ్బులు తిరిగి చెల్లిస్తామని సందేశం పంపగా మోసపోయానని గ్రహించిన కనిగిరి పట్టణానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు.. ఒంగోలులోని తన ఫ్యాక్టరీకి లోన్ ఇప్పిస్తామని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి వారి యొక్క క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనే పేరు మీద కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 50% సబ్సిడీ కూడా వస్తుందని నమ్మించి, తన వద్ద నుంచి ఫిక్స్డ్ మరియు ఇతర లోన్ శాంక్షన్ కావటానికి మొత్తం 57 లక్షల రూపాయలు తీసుకొని, తదుపరి తను విచారించుకొని అటువంటి ఏ క్రెడిట్ సొసైటీ లేదని తెలుసుకొని తన వద్ద నుండి డబ్బులు మోసపూరితంగా తీసుకున్నారని, డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నారని ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు.
తన కుమారుడుకు విజయవాడ రైల్వే స్టేషన్ లో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుండి అడ్వాన్స్ గా రూ.25,000/- డబ్బులు ఫోన్ పే ద్వారా పేర్నమిట్ట మరియు విజయవాడ చెందిన ముగ్గురు వ్యక్తులు తీసుకోని ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు అడుగుతుంటే ఇవ్వటం లేదని సంతనూతలపాడు మండలానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్.బి డిఎస్పీ సురేష్ బాబు, సిసియస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, డీటీసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, యజి పాడు పియస్ ఎస్సై రజియా సుల్తాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *