హైదరాబాద్ మే 27(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఇంజనీరింగ్ కాలేజీలలో ఆడిట్ పరిగణనలోకి తీసుకోకుండా, ఫ్యాకల్టీ కి జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తూ ఫీజులు పెంచాలనే ప్రతిపాదనను ఆమోదించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (టి పి టి ఎల్ ) కలసి మెమొరాండం అందజేశారు.టి పి టి ఎల్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఏ. విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్ లు బాలకృష్ణారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఏ. విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీలను మెజారిటీగా ఆడిట్ చేసేది జే ఎన్ టి యు యూనివర్సిటీ అధికారులు చేస్తారన్నారు. అనుమతులు ఇచ్చేది యూనివర్సిటీనే. ఫ్యాకల్టీ ఎంత మంది ఉన్నారు. ఎంత హాజరు శాతం ఉంది. వారికిచ్చే జీతాలు ఎంత? ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి. ఇతర వసతులు ఏమిటి ఇవన్నీ పరిశీలించేది కూడా జే ఎన్ టి యు యూనివర్సిటీ అన్నారు. యూనివర్శిటీ ఆడిట్ పరిగణనలోకి తీసుకోకుండా ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఎలా ఫీజుల పెంపు ప్రతిపాదన చేస్తుందనీ, కాలేజీలు ఇష్టారీతిన పెంపుదల ప్రతిపాదనలను ఎలా ఆమోదిస్తుందని, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఫీజులు అధికారికంగా పెంచడానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఫ్యాకల్టీ కి తక్కువ జీతాలు ఇస్తూ ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. ఇదేమీ అని ప్రశ్నించిన లెక్చరర్లను, ప్రొఫెసర్స్ ను బెదిరించి అర్ధాంతరంగా విధులు నుంచి తొలగిస్తున్నారు.ఇలాంటి పరిస్తితులలో చేసేది ఏమి లేక చాలా మంది ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ కు తలూపి అకౌంట్ లో వేసిన డబ్బులను తిరిగి సగం ఇస్తున్నారన్నారు. దీన్ని ఎఫ్ అర్ సి పట్టించుకోవడం లేదనీ అన్నారు.ఇంజనీరింగ్ ఫీజులు 100శాతం పెంచడం అంటే కొన్ని కాలేజీల ఫీజు 5లక్షలు చేస్తున్నాయన్నారు. ఇంత ఫీజు తెలంగాణ విద్యార్ధి తల్లి తండ్రులు ఎలా కట్టగలరు. ట్రస్ట్ పేరుతో సేవ చేయడానికి విద్యా సంస్థ ఏర్పాటు చేశామని చెప్పి అధిక ఫీజులు పెంచాలని కోరడం ఏమిటి కొన్ని కాలేజీలు హైదరాబాద్ లో ఉండి కూడా తక్కువ ఫీజులతో నడిపిస్తుండగా హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు ఎక్కువ ఫీజులు వసూలు చేయడం ఏమిటన్నారు. ఫ్యాకల్టీ కి ఎక్కువ జీతాలు ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. మరి ఫీజులు ఎందుకు పెంచాలో హేతుబద్ధత లేదు. పోనీ కమిటీ సభ్యులు రీ చెక్ కానీ, పరిశీలన కానీ చెయ్యకుండా ఓకె చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
జే ఎన్ టి యు ఉస్మానియా యూనివర్సిటీ ఆడిట్ పరిగణనలోకి తీసుకొని ఫీజులను పెంపును పరిశీలించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కి టి పి టి ఎల్ ఎఫ్ తరుపున మెమొరాండం ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారు లిఖిత పూర్వక పిర్యాదు లో కోరారు.
