దర్శి లో ఘనంగా రఘుపతి వెంకటరత్నం వర్ధంతి వేడుకలు

దర్శి మండల పరిషత్తు కార్యా లయంలో ప్రకాశం జిల్లా ఐఆర్సీయస్ (ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ) ఎగ్జికూటివ్ మెంబర్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 87వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు . ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి హౌసింగ్ ఏఈ షాకీర్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅ తిథులుగా మండల పరిషత్తు అభివృద్ధి అధికారి క్రిష్ణమూర్తి, ఎంఈవో రఘురామయ్య, ఐఆర్సీయస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మానవత స్వచ్చంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపిడీవో వెంకటరత్నం నాయుడు సేవలను కొనియాడారు. ఎంఈ వో రఘురామయ్య మాట్లాడుతూ.., రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎన్నో సంస్కరణలు చేపట్టారని తెలిపారు. ఈ సందర్భంగా కపురం మాట్లాడుతూ…, రఘుపతి వెంకటరత్నం నాయుడు సంఘసంస్కర్తగా, గొప్ప విద్యావంతునిగా, పవిత్రతకు సంతోషంగా, బ్రహ్మర్షిగా భారత దేశంలోని తెలుగుప్రాంతాలలో పేరుప్రఖ్యాతులు ఘఢించిన గొప్పవ్యక్తిగానేగాకుండా, హిందీ, ఉర్దూ, పార్షీ, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించి, కాకినాడ పీఆర్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా చేస్తూ, 1911 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహిళలను కాలేజీలో చేర్చుకొని సహవిద్య(కో ఎడ్యుకేషన్)కు ఆధ్యు డయ్యారని, ఆ మహనీయుడు సేవలను మరువకూడదని రఘుపతి వెంకటరత్నం నాయుడు ను కపురం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *