వైయస్సార్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు జరుగుతున్న మహానాడు కార్యక్ర మానికి అద్దంకి తెలుగు తమ్ముళ్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగినేని రామకృష్ణ 30వ సారి రక్తదానం చేశారు. మహానాడులో రక్తదానం చేయడం ప్రతిసారి ఆనవాయితీగా వస్తున్నట్లు నాగినేని చెప్పారు. రక్తదానం చేసిన నాగినేని రామకృష్ణ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అభినందించి సర్టిఫికెట్ ను అందించారు. ఆయనతో పాటు గోగులమూడి రాజశేఖర్, ఇడవలపాటి రాకేష్ లు రక్తదానం చేశారు. వీరితోపాటు పెంట్యాల రామాంజనేయులు, సురేష్ ఉన్నారు. మహానాడు ముగిసే వరకు నేతలంతా అక్కడే ఉండేవిధంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.




