పోలేరమ్మ తల్లి కొలుపుల ముగింపు కార్యక్రమంలో వెలుగువారిపాలెం గ్రామంలోఆదివారం ఘనంగా నిర్వహించారు. పురాతన కాలంలో నిర్మించిన పోలేరమ్మ ఆలయం గ్రామ నడిబొడ్డున వుండి శిధిలావస్థకు చేరుకోవటంతో పెద్దల నిర్ణయం మేరకు 5ఏళ్ల క్రితం రెడ్డిసాగర్ కు వెళ్లే మార్గంలో గ్రామ శివారున నూతన ఆలయం నిర్మించి పోలేరమ్మను ప్రతిష్టించారు. 30 ఏళ్ల క్రితం వరకు వెలుగువారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తల్లికి సంప్రదాయ బద్దంగా కొలుపులు నిర్వహించేవారు. అప్పటి వరకు కొలు పులు సజావుగా సాగాయి. అప్పటినుండి కొలుపులు నిలిచి పోయాయి.
శ్రీపోలేరమ్మ తల్లికి కొలుపులుచేస్తే గ్రామం, ఈప్రాంతం అన్ని రంగాల్లో వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ గత నెల 23 వతేదీజూన్1 వతేదీవరకు వరకు 10 రోజుల పాటు కొలుపులుఘనంగా జరిపారు.గత మూడురోజులపాటు ఆచార, సంప్రదాయాల ప్రకారం పోలే రమ్మ తల్లికి శాంతి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా కొలుపులు జరుపుకుని బంధువులనుపిలవటంతో కొలుపులకు వేలాదిమందిగా,వారి బంధువులు తరలి రావటంలో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ ఎన్ పిచ్చయ్య, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జడ్పీటీసీ మారం వెంకట రెడ్డి,మండల టీడీపీ అధ్యక్షులు ఎం. వెంకటేశ్వరరెడ్డి, మాజీఅధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి,రాచకొండవెంకట్రావు,ఎన్ ఆదినారాయణరెడ్డి, రామకోటిరెడ్డి, శాగంకొండారెడ్డి, వీరనాగిరెడ్డి,పిన్నిక రమేష్, విద్యాసాగర్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

