బేగంపేటలో హైడ్రా కూల్చివేతలు – నాలను ఆనుకుని ఉన్న నిర్మాణాలు నేలమట్టం.

బేగంపేట జూన్ 6(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట ప్యాట్ని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు.నాలా పై ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుండి కూల్చివేతలు చేపట్టారు.నిన్న బేగంపేట ప్యాట్ని నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ లు నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకున్నారు.ప్యాట్ని నాలా విస్తీర్ణం కుచించుకుపోవడంతో వర్షం వస్తే భారీగా వరద నీరు కాలనీలోకి ఇళ్లల్లోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపద్యంలో స్థానికులు హైడ్రాను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఉదయం నుండి నాలాల పై ఉన్న అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల సహాయంతో నేలమట్టం చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *