పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను నిర్దిష్ట గడువు వరకూ వేచి ఉండకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రకాశం భవనములో ప్రత్యేక జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో పరిశ్రమలకు చెందిన వివిధ రాయితీలకు 449 క్లెయిములకుగాను 7 కోట్ల 22 లక్షల రూపాయలను మంజూరు చేశారు.
సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసిన వివిధ శాఖలకు చెందిన 137 అనుమతులలో 110 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశారు. మిగిలిన వాటిని కూడా నిర్దిష్ట గడువులోగా పరిశీలించి అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమ సంస్థ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, ఏపీ సిపిడిసిఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాబార్డు ఏజీఎం రవికుమార్ , ఏపీఐఐసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

