తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో
మంగళవారం మన ఊరి బడిని కాపాడుకుందాం కార్యక్రమం నిర్వహించారు. 3,4,5 తరగతులు విద్యార్థులకు తిరిగి ప్రాధమిక పాఠశాలకు పంప టంతో హైస్కూల్ నుండి విద్యార్థులను తిరిగి మోడల్ ప్రైమరీ స్కూల్ మార్చిన పాఠశాలకు పంపే విధంగా సహకరించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన హెచ్ఎం కె సుబ్రమణ్యం చారి, ఎస్ఎంసీ చైర్మన్ గుజ్జుల శివా రెడ్డిని కలిసి విన్నవించారు. దీంతో ఆయన విద్యార్థుల తల్లి దండ్రులను కలసి 15 మంది విద్యార్థులను పాఠ శాలలో చేర్పించారు. కార్యక్రమంలో పాఠశాల పూర్వ ఉపాధ్యాయుడు పోలంరెడ్డి సుబ్బారెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం అంజిరెడ్డి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన వైనాన్ని వివరించారు.
