సాగుకు సమాయత్తం ఏరువాక పౌర్ణమి

వర్షరుతువు ప్రారంభంలో మృగ శిర కార్తేను స్వాగతిస్తూ పౌర్ణమి రోజు రైతులు నాగలితో దుక్కి దున్నటంతో సేద్యపు పనులు ప్రారంభం అవుతాయని తొలకరి వర్షం పడగానే రైతులు విత్తుకోవటం ముమ్మరంగా సాగు పనులు చేపడతారని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తూర్పుగంగవరంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి దుక్కి దున్ని ఏరవాక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పంట మార్పిడి విధానం అనుసరిస్తే లాభదాయకం

పంట మార్పిడి విధానం అనుసరిస్తే లాభదాయకమని కెవికే నోడల్ ఆఫీసర్ మానన అన్నారు.
దోసకాయలపాడులో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఎక్కువగా సేంద్రీయ ఎరువులు వాడుకోవాలని చెప్పారు. కోళ్ల పరిశోధన శాస్త్రవెత్త డాక్టర్ లెస్లిలియా ప్రిన్స్ మాట్లాడుతూ మిశ్రమ వ్యవసాయంలో బాగంగా కోళ్ల పెంపకం చేయటం వలన రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. వ్యాధుల నియంత్రణలో పాటించాల్సిన మేలుకువల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యాన విస్తరణ అధికారి స్వర్ణలత నరసింహాం, కోటి రత్నం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *