తాళ్లూరు మండలంలో పలువురు అధికారులు బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో నూతనంగా అధికారులు బాధ్యతలు చేపట్టారు. తాళ్లూరు డిప్యూటీ ఎంపీడీఓ సుందర రామయ్యను పామూరుకి బదిలీ చేసారు. హనుమంతుని పాడు నుండి డిప్యూటీ ఎంపీడీఓ హనుమంతరావు తాళ్లూరు డిప్యూటీ ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. తాళ్లూరు డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు ను కనిగిరి ఆర్ డీఓ కార్యాలయంకు బదిలీ అయ్యారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న జి ఫణీంధ్ర ను తాళ్లూరు డిప్యూటి తహసీల్దార్గా కనిగిరిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస రావును తాళ్లూరు కు బదిలీ చేసారు. వారు ఆయా స్థానాలలో బాధ్యతలు స్వీకరించారు.
తాళ్లూరు మండలంలో పలువురు అధికారులు బదిలీలు
11
Jun