తాళ్లూరు మండల మహిళా సమాఖ్య సమావేశం బుధవారం ఎంఎంఎన్ అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన నిర్వహించారు. స్త్రీ నిధి జోనల్ డీజీఎం ఉమామహేశ్వర రావు, ఎజీఎం ఉదయ్ కుమార్, ఎసీ పవన్ కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ … స్త్రీ నిధి బుణాలు రూ.29 లక్షల వరకు బకాయిలు ఉండటంతో స్త్రీ నిధి రుణాల మంజూరు నిలచి పోయిందని, గ్రామైఖ్య సంఘ బాధ్యులు స్పందించి రుణాల వసూళ్లపై శ్రర్థ చూపాలని అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక తయారు చెయ్యాలని కోరారు. ఎంపీఎం దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
