ప్రభుత్వ స్థలాలు, సైడు కాలువలపై ఆక్రమణలు చేస్తే తక్షణమే తొలగిస్తామని పంచాయితీ అధికారులు చేసిన ప్రగల్భాలు ఉత్తర ప్రగల్భాలుగానే మిగిలి పోయాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నిత్యం కొద్ది కొద్దిగా ఆక్రమణలకు గురవుతుండటమే నిదర్శనం. ఆ ప్రాంతంలో బంకులు ఏర్పాటు చేయటం వలన అక్కడే మద్యం సేవించి పాఠశాల, కళాశాల ప్రాంగణంలోనికి మద్యం సీసాలు, ఇతర వ్యర్థపదార్ధాలు వేస్తున్నారు. దీంతో నిత్యం స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గురించి వల్లెవేస్తున్న అధికారులకు ఇది కనిపించక పోవటం ఎమిటని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా నరే భరిస్తున్న విద్యార్థులకు నూతనంగా మరోక దుకాణం కూడ వెలుస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో బుధవారం వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కొండపల్లి ఆంజనేయులు తాళ్లూరు ఎస్సై, ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామకార్యదర్శులకు ఫిర్యాదు చేసారు. ఆక్రమణలను తొలగించక పోతే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు.
