పాఠశాలలు పున: ప్రారంభం – ఫైన్ రైస్ పరిశీలన – ఎన్ ఆర్ కె వి ఎం విద్యా కిట్లు పంపిణీ

తాళ్లూరు మండలంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు గురువారం పున: ప్రారంభమయ్యాయి. మండలంలోని 15 మోడల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు చేపట్టారు. ఆయా పాఠశాలలో ఫైన్ రైస్ (నన్నబియ్యం) తో డొక్కా సీతమ్మ మధ్యాహ్నబోజనం ప్రారంభించారు. విద్యార్థులు అందరూ మంచి పౌష్టికాహారం తీసుకుని చక్కగా విద్యను అభ్యసించాలని మండల విద్యాశాఖాధికారి-2 సుధాకర్ రావు అన్నారు. తాళ్లూరు వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఫైన్ రైస్ ను పరిశీలించి, నర్వేపల్లి రాధా క్రిష్ణ విద్యా మిత్ర కిట్స్ ను అందించారు. డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు సానికొమ్ము నత్యం, విఆరి చంధ్ర, హెచ్ఎం శ్రీనివాసరావు, పీఎంసీ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మండలంలోని బొద్దికూరపాడుతో పాటు పలు పాఠశాలలో బడికి పోదాం కార్యక్రమం నిర్వహించారు. తల్లికి వందనం నగదు విడుదల అవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కస్తూరిబా సందర్శించిన జీసీడీఓ హేమలత …

కస్తూరిబా పాఠశాలను జీసీడీఓ హేమలత గురువారం సందర్శించారు. విద్యార్థులకు సరఫరా చేసిన సన్నబియ్యంను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నన్నని మంచి బియ్యంతో పౌష్టికాహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి రావాలని కోరారు. మోను పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *