హైదరాబాద్ జూన్ 12(జే ఎస్ డి ఎం న్యూస్) :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 1987 నుండి 2012 మధ్యకాలంలో యూజీ ( డిగ్రీ) కోర్సులలో చేరి పలు కారణాలవల్ల మధ్యలో ఆగిపోయిన అప్పటి విద్యార్థులకు తిరిగి ఆ కోర్స్ లను పూర్తి చేసుకునే అవకాశాన్ని విశ్వవిద్యాలయ అధికారులు కల్పించారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రామాచారి గురువారం తెలిపారు . జూబ్లీహిల్స్ లోని యూనివర్సిటీ కేంద్ర కార్యాలయం కు వెళ్లి రీ అడ్మిషన్ ను పొంది బ్యాక్ లాక్ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరు కావచ్చని ఆయన చెప్పారు. రాబోయే 2025 డిసెంబర్ లోపు రెండు అవకాశాలలో రీ అడ్మిషన్ పొందిన విద్యార్థులు డిగ్రీ పరీక్షలకు హాజరై కోర్సును పూర్తి చేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు. అదే విధంగా 2013,2014,2015, 2016. బ్యాచుల బ్యాక్ లాగ్ అభ్యర్థులు రీ అడ్మిషన్ పొంది థియరీ, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావచ్చని ఆయన చెప్పారు. ఈనెల 20 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా రీ అడ్మిషన్ పొందవచ్చని, 500 రూపాయల ఆలస్య రుసుముతో ఈనెల 26 వరకు మరొక అవకాశం లభిస్తుందని తెలిపారు. 30 జూలై నుండి ఆగస్టు 11 వరకు నిర్ణయింపబడిన తేదీలలో ప్రధమ, ద్వితీయ,తృతీయ సంవత్సర పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బ్యాక్ లాగ్ సబ్జెక్టులు కలిగిన అభ్యర్థులు రీ అడ్మిషన్ ను పొంది ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
