తాళ్లూరుమండలంలోని పలు దేవాలయాల భూములకు బహిరంగ కౌలు వేలం పాటలను శనివారం నిర్వహించారు. శివరామపురం వేణుగోపాల స్వామి ఆలయంలో అగస్తేశ్వర ఆలయం కు చెందిన 28.72 ఎకరాల భూమి 8 బిట్లకు, రామబధ్రా పురంలో కోదండ రామ స్వామి దేవస్థానంకు చెందిన 14.32 ఎకరాల భూమి 8 బిట్లకు వేలం కౌలు పాటను నిర్వహించారు. అగస్తేశ్వర స్వామి ఆలయంకు గత సంవత్సరం రూ. 2,99,500 కౌలు పలుకగా, ప్రస్తుతం రూ.4,25,500 కౌలుకు రైతులు పాడుకున్నారు. అదేవిధంగా కోదండరామ స్వామి ఆలయంకు గత సంవత్సరం రూ. 1,48,500కు కౌలు పాడుకోగా, ప్రస్తుతం రూ. 1,51,600లు కౌలుకు రైతులు పాడుకున్నారు. దేవస్థాన జె పంగులూరు గ్రూప్ దేవస్థాన కార్యనిర్వాణాధికారి యు శ్రీనివాస రావు, కార్యనిర్వాహణాధికారి జి వాసు బాబు, సిబ్బంది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
