బేగంపేట జూన్ 17(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట సన్ షైన్ కిమ్స్ ఆస్పత్రి లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ను మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట బీ ఆర్ ఎస్ నాయకులు టి.శ్రీహరి ఉన్నారు.

