హైదరాబాద్ జూన్ 24 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆహ్వానం పలికారు. సోమవారం మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, దేవాలయ ఈవో మనోహర్రెడ్డి ప్రధాన ఆర్చకులు రామతీర్థ శర్మలు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 29వ తేదీన అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుందని, జూలై 13,14వ తేదీల్లో మహంకాళి బోనాలు, రంగం కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. లక్షల మంది పాల్గొనే ఈ బోనాల జాతరకు ఎక్కడ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసే జాతర విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
