ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 16 నూతన ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ఆఫీసు, మంగళగిరి నుండి వచ్చిన వాటిలో టీవీఎస్ అపాచీ ఆర్ టి ఆర్ 160 సీసీ ద్విచక్ర వాహనాలు 15, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఒకటి, ఈ వాహనాలకు సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, ప్రధమ చికిత్స కిట్, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ ఈ ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు మరింత వేగవంతంగా స్పందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఇవి ఉపయోగపడతాయి. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ, మరియు ప్రజలకు వేగవంతమైన సేవలందించడానికి ఈ ద్విచక్ర వాహనాలు ఎక్కడైనా త్వరగా చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో, ప్రమాద సంఘటనల సమయంలో తక్షణ చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్ జాం సమస్యలు పరిష్కరించడం వంటి అంశాల్లో ఈ వాహనాలు ఎంతోగానో ఉపయోగపడుతాయని, విజిబుల్ పోలీసింగ్ పెరగడంతో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని, ఎక్కడైనా ఫోర్ వీలర్ వెళ్ళలేని ప్రాంతాలలో టూ వీలర్స్ వెళ్ళి అక్కడ ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పని చేస్తాయన్నారు. నూతన ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్ క్రమబద్ధీకరించే పోలీస్ సిబ్బందికి వారి విధులు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు.
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని, వాటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని, తలకు గాయాలు కాకుండా హెల్మెట్ రక్షణ కల్పిస్తుందన్నారు. కావున ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



