15వ ఆర్థిక సంఘం నిధులు అందక పంచాయితీలు విల విల – పారిశుధ్య కార్మికులకు సైతం జీతాలు ఇవ్వలేని దుస్ధితి – పూట గడువక ఇబ్బందులు పడుతున్న పంచాయితీ కార్మికులు

పంచాయితీల అభివృద్ధికి విడుదల కావలసిన 15వ ఆర్థిక సంఘం నిథులు విడుదల కాక పోవటంతో పంచాయితీలలో పాలన అస్తవ్యస్తంగా మారింది. నిత్యం పారిశుధ్య పనులు వచ్చే పంచాయితీ కార్మికులకు సైతం జీతాలు ఇవ్వలేని దుస్థితిలో పంచాయతీలు ఉండటంతో కార్మికుల గత తొమ్మిది నెలలుగా జీతాలు లేక పలు పంచాయితీలలో పంచాయితీ కార్మికులు పూట గడువక ఇబ్బందులు పడుతున్నారు.
బొద్దికూరపాడు పంచాయితీలో కార్మికులకు 9 నెలలుగా వేతనాలు అందక పోవటంతో తమకు పూట గడవటం ఇబ్బందిగా ఉందంటూ తక్షణమే జీతాలు చెల్లించాలని విన్నవించుకుంటున్నారు. పలు పంచాయితీలలో సర్పంచిలు కొంత మేర సర్దుబాటు చేసారు. అయితే బొద్దికూరపాడు పంచాయితీలో కార్మికుల మాత్రమే 9 నెలల వేతనాలు ఇవ్వాలని తమకు అనేక ఇబ్బందులు ఉన్నాయని సర్పంచికి తెలపటంతో ఏమి చెయ్యలేక మిన్నకుండి పోయారు. ఈ విషయమై సర్పంచిని మందా శాంసన్ వివరణ అడుగగా ..మూడు నెలలకు సంబంధించి వేతనాలు అయినా సరే ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నామని. నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి 15వ ఆర్థిక సంఘం నిథులు విడుదల అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *