తాళ్లూరు మండలం లో
పల్లె పండుగలో మండలంలో దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 56 సీసీ రోడ్లను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలిస్తున్నారు. మాధవరం, కొత్త పాలెం గ్రామంలో క్వాలిటీ కంట్రోల్ డీఈ శివ ప్ర సాద్ ఆధ్వర్యంలో ఎఈ రమేష్ రెడ్డి, మండల ఎఈ వెంకటేశ్వర్లు పాల్గొని పలు సీసీ రోడ్ల నాణ్యతను యంత్రాల సహాయంతో పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పారు.
