కృత్రిమ ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు సూచించారు. నాగంబొట్ల పాలెం, తూర్పుగంగవరం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతుకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
యూరియా వాడకం తగ్గించాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో బాగంగా సాగులో తొమ్మిది నూత్రాలు పాటించాలని కోరారు. నేలను 365 రోజులు కప్పి ఉంచాలని, తేలిక పాటి దుక్కి దున్నాలని, ఘన, ద్రవ, బీజా మృతం వంటి ఉత్ప్ర్పేర కాలు వాడాలని, దేశ విత్తనాలు వాడాలని, పలు పంటలు వెయ్యాలని, ఆచ్చాధనంగా సేంద్రీయ అవశేషాలను, పంట వ్యర్థాలను, పురుగుల నియంత్రణకు అస్త్రాలు, తెగుళ్ల నియంత్రణకు కషాయాలు వాడాలని, పాడి పశుసంపదను వ్యవసాయంతో అనుసంధానం చెయ్యాలని, రసాయనాలు, కలుపు మందులను వాడరాదని తెలిపారు. ఎఈఓ దయా సాగర్, ప్రకృతి ఇన్చార్జి పి నరసింహులు పాల్గొన్నారు.
