పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్

త్వరలో పోలీసులకు శిక్షణ నేపథ్యంలో ఒంగోలులోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ను బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్
సందర్శించారు. అనంతరం డి.టి. సి చుట్టూ వున్న పరిసర ప్రాంతాలు, మౌలిక వసతులు, బ్యారక్ లు, ఓపెన్ జిమ్, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ ను ఇతర అధికారులతో కలసి పరిశీలించి, శిక్షణ నిమిత్తం అవసరమైన అన్ని ఏర్పాటులను త్వరితగతిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అలాగే, డిటీసీలో చేపట్టవలసిన మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎస్పీ , సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు అందించారు. అనంతరం, శిక్షణార్థులకు శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్ మరియు ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే గ్రౌండ్ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మైదానం చదునుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని, రన్నింగ్ ట్రాక్, డ్రిల్ ఏరియా, మరియు గార్డన్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కొత్త పోలీసు సాంకేతికతలకు, ఆధునిక విధానాలకు అనుగుణంగా శిక్షణా ప్రణాళికలు నవీకరించాల్సిన అవసరం ఉందనన్నారు. శిక్షణ కేంద్రంలో అదనపు సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని, మౌలిక వసతుల ఏర్పాటుకి ప్రత్యేక శ్రద్ధ అవసరమని, అలాగే వర్షపు నీరు బయటకు పోవుటకు ఏర్పాట్లు చేయాలని, పరిసర ప్రాంతాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్
వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు ,డీటీసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, పిసిఆర్ ఎస్సై వేణుగోపాల్, అర్ ఎస్సై రవి కుమార్ మరియు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *