మద్యంకు బానిసైన ఓ యువకుడు తల్లిదం
డ్రులతో గొడవపడి తాగిన మైకంలో గుంటిగంగ వద్ద వృద్ధాశ్రమం చెట్టుకు ఉరివే సుకుని మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం కేసు నమో దయింది. పోలీసులకథనం మేరకు తూర్పుగంగవరం గ్రామానికి చెందిన బోగోలు బ్రహ్మం పెద్దకుమారుడు మహేష్ (25)చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. బ్రహ్మాంకు ఇద్దరు కుమారులు బ్రహ్మాం గ్రామంలో సెలూన్ షాప్ నిర్వహించుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దకుమారుడు మహేష్ ప్రవేట్ మెడికల్ ప్రాక్టీస్ గా చేస్తూ పలు గ్రామాలకు వెళ్లి వైద్యం చేస్తుంటాడు. మహేష్ మద్యంకు బానిసై కుదుటుగా పని చేయక గతమూడునెలలుగా ఇంటిపట్టునే వుంటున్నాడు. తల్లిదం డ్రుల మాటలు వినకుండా నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవలకు దిగు తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. తల్లిదండ్రులు మహేష్ ప్రవర్తన పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహేష్ ఇంట్లోని తనతల్లి చీరను తీసుకుని వెళ్లి పోతూ తాను చనిపోతానని బెదిరించి వెళ్లి పోయాడు. రాత్రి పొద్దు పోయినా ఇం టికి రాక పోవటంతో మృతుని తల్లి కుమారుని సెల్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కాల్ ఎత్తలేదు. ప్రతి రోజు ఇదే విధంగా గొడవ చేస్తుంటాడు, ఇంటికి తిరిగి వస్తాడనుకున్నారు. 2వ తేదీ బుధవారం ఉదయం మహేష్ గుంటిగంగ లోని వృద్ధా ఆశ్రమం వద్ద గల చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది వున్నారని గ్రామస్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు. వెళ్లి చూడగా తమ కుమారుని మృత దేహంగా గుర్తించి కన్నీరు మున్నీరుగా విలపించారు.తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి బ్రహ్మం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ జి. మోహన్ రావు
కేసు నమోదు చేశారు.ఎస్సై మల్లిఖార్జునరావు మృతదేహాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేపట్టారు. ఇదిలా వుండా చెట్టుకు చీరతో ఉరి వేసుకుని మృతి చెందిన యువకుని మోకాళ్లు నేలకు ఆనుకుని ఉండటంతోఆత్మహత్యా, హత్య అన్న అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి. నేలకు కాళ్లు అనుకుంటే కాళ్లు అనుకుంటే ఎలా చని పోయాడని పలు వురు అంటున్నారు. పోలీసులు దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూడాల్సి ఉంది.

