జర్నలిజంలో అందించిన సేవలకు గాను శ్రీ గురు పురస్కారం 2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డును నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బి ఎస్ ఎస్ శశి అందుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీ కాసు కళ్యాణ మండపంలో అఖిల భారతీయ మహా సంఘ్ ఆంధ్రప్రదేశ్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సాహితీ పండితుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి శ్రీ గురు పురస్కారాలు ప్రధానం చేసి సత్కరించారు. ఎక్స్ ప్రెస్ టుడే తెలుగు దినపత్రిక ఎడిటర్, నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బి ఎస్ ఎస్ శశి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ మనవడు డాక్టర్ సుబ్రమణ్య శర్మ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. శశిని ఘనంగా సత్కరించి అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుగా శశి ప్రస్తానం , పనితీరు, జర్నలిజం రంగంలో చేస్తున్న కృషిని వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ మహాసంఘ్ రాష్ట్ర ప్రతినిధులు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాస శర్మ, ఏ బి బి ఎం ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శశి మాట్లాడుతూ తను సేవలను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.

