అఖిల భారత బ్రహ్మాణ మహా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారతీయ విద్వత్సభలు, పంచాగ కర్తల సదస్సులో గురు పుష్కార్ అవార్డును తాళ్లూరు మండలం బొద్దికూరపాడు వాసి గాజుల పల్లి గౌతమ్ పొందారు. నరసరావు పేటలో కాసు కళ్యాణ మండపంలో మంగళవారం నదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బొద్దికూరపాడు గ్రామ పురోహితులు గాజుల పల్లి సత్యనారాయణ మనుమడు గాజుల పల్లి గౌతమ్ శర్మకు 2025 జ్యోతిష్య మార్తాండ బిరుడును పురష్కారం చేసారు. సర్వేపల్లి రాధా క్రిష్ణ మనుమడు నుబ్రమణ్యం శర్మ, ప్రముఖ సిద్ధాంతి బెట్టే దైవజ్ఞ, బీవీఎన్, ఇంద్ర కీలాద్రి సిద్ధాంతి చల్లా శ్రీనివాస శర్మ లు అవార్డును ప్రధానం చేసారు. కార్యక్రమంలో ఎబీబీఎం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఇంద్ర కంటి ప్రసాద్ శర్మ సిద్దాంతి, సంఘ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దేవళ్ల వనంత సాయి నాధ శర్మ, కోశాధికారి అనుండి హనుమాన్ శాస్త్రి పాల్గొన్నారు. అవార్డు పొందిన గౌతమ్‌కు రిటైర్డు హెచ్ఎం ఎన్ అంజిరెడ్డి, ఉపాధ్యాయుడు సుబ్బా రెడ్ది పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

