పొగాకు కు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తాళ్లూరు, 1, 2 సేవా కేంద్రాల పరిధిలో తాళ్లూరు వ్యవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎడీఏ బాలాజీ నాయక్ మాట్లాడుతూ వైట్ బర్లీ, బ్లాక్ బర్లీ అయిన పొగాకు వేయవద్దని, చిరుధాన్యాలు, ఉద్యాన వన పంటలు, ఆరు తడి పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ పంటల భీమా పథకం ఈనెల చివరి వరకు ఉందని సాగు చేసిన పంటలను ఈ -క్రాప్ చేయించి భీమా చేయించుకోవాలని కోరారు. ఆగష్టు 15 వరకు వరి రైతులకు భీమాకు అవకాశం ఉందని చెప్పారు. డ్రిప్, స్పింక్లర్లు అవసరమైన రైతులు పొందవచ్చని చెప్పారు. పచ్చి రొట్ట విత్తనాలు వేసి విరివిగా సాగు చేసుకుని కలియ దున్నుకోవాలని కోరారు. ఆత్మ బిటీఎం నాగభూషణం, సెరికల్చర్ టీఏ రఘ తదితరులు పాల్గొన్నారు.
