రానున్న మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండరాదన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి లబ్దిదారునికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేయడం జరుగుచున్నదని,
అందులో భాగంగా ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను పెండింగ్ లో లేకుండా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడంతో పాటు ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, తహసిల్దార్ల ను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్ లతో సమావేశమై హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పిజిఆర్ఎస్ లో రెవెన్యూ అంశాలపై వచ్చిన దరఖాస్తుల పెండేన్సి, ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ, రీ సర్వే పురోగతి, కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డు ల మంజూరు, నిత్యావసర సరుకుల పంపిణీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ.. హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ పై తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్, తహసిల్దార్లను ఆదేశించారు. జిల్లాల్లో పిజిఆర్ఎస్ లో రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా దరఖాస్తులను, సమస్యలను పెండింగ్ లో లేకుండా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రీ ఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రీ సర్వే పురోగతిపై సమీక్షిస్తూ, నిర్దేసించిన గడువులోపు రీ సర్వే ప్రక్రియను పూర్తీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సిసిఆర్సి కార్డుల మంజురుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిజమైన కౌలు రైతులకు సీసీఆర్సి కార్డులు మంజూరు చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లా లో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో సమావేశంలో ఎస్.డి.సి లు వరకుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రావు, హౌసింగ్ పిడి శ్రీ శ్రీనివాస ప్రసాద్, డిఎస్ఓ పద్మశ్రీ, జిల్లా సర్వ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, తదితర అధికారులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి రెవెన్యు డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

