నైపుణ్యాలే జీవనోపాధికి పునాది -హెచ్ఎం వైఎస్ఆర్ కెప్రసాద్

విద్యార్థులు చదువుతో పాటు జీవితంలో అన్ని రంగాల్లో నైపుణ్య సాధించాలని హెచ్ఎం వైఎస్ఆర్ కెప్రసాద్ అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం హైస్కూల్లో వరల్డ్ యూత్ స్కిల్ డే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యాలే జీవ నోపాధికి పునాది అన్నారు. తూర్పు గంగవరం పాఠశాలకు వొకేషనల్ విద్యలో బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్ అందించినట్లు తెలిపారు. విద్యార్థులకు డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. వొకేషనల్ ట్రైనర్స్ వై.అంజిబాబు, సీహెచ్ దావీద్, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *