యాదవ్ రెజిమెంట్ ను వెంటనే అమలు చేయాలి – రాష్ట్ర శతాబ్ది ఉత్సవాలు అధ్యక్షులు బొట్లా రామారావు యాదవ్,జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు యాదవ్

భారత సైన్యంలో అహిర్ రెజిమెంట్ ( యాదవ రెజిమెంట్ ) ను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు నగరం లో యాదవుల గురువారం ర్యాలీ నిర్వహించారు.
పెళ్లూరు లోని దేవాలయం లో పూజలు నిర్వహించి ర్యాలీ ని ప్రారంభించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

1962, నవంబర్ 18 న రెజాంగ్ లా వద్ద జరిగిన భారత్ – చైనా యుద్ధములో 114 మంది యాదవ సైనికులు వీర మరణము పొందిన స్థలము నుండి పవిత్ర మట్టిని తీసుకోని కలశము లో నింపి యాదవ సైనికుల వీర త్యాగానికి గుర్తు గా లక్ష కిలోమీటర్ల కలశ రధ యాత్ర దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో జరుపుచున్న సందర్భంగా గురువారం ఉదయం ఈ యాత్ర ఒంగోలు కు చేరుకున్నది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వరి యాదవ్ మాట్లాడుచూ… ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన 8 యుద్ధాల్లో రెజంగ్లా యుద్ధం చాలా ప్రాముఖ్యత కలిగినదని,
ఇది దేశానికి గర్వకారణం అని
18 నవంబర్ 1962 న, భారతదేశంలోని లడఖ్‌లోని రెజంగ్లా వద్ద చైనా తో పోరాడిందని, కుమావోన్ రెజిమెంట్ లో 120 మంది యాదవ సైనికులు ఉన్నారని చెప్పారు. వీరికి మేజర్ షైతాన్ సింగ్ నాయకత్వం వహించారని
120 మంది అహిర్ లు ( యాదవ సైనికులు) భారతీయ సైనికులు – 5000 మంది చైనా దళాలను ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ దాడిలో 1310 మంది చైనా సైనికులను హతమార్చారని
114 మంది ధైర్యవంతులైన యాదవ రెజిమెంట్ కు చెందిన సైనికులు భారతమాత రక్షణలో అమరులయ్యారన్నారని వివరించారు.
రాష్ట్ర శతాబ్ది ఉత్సవాలు అధ్యక్షులు బొట్లా రామారావు మాట్లాడుచూ …. రెజంగ్లా యుద్ధ భూమిని 3 నెలల తర్వాత అనగా 10 ఫిబ్రవరి 1963న సందర్శించిన భారతీయ రక్షణ శాఖ శోధన బృందం నిర్ఘాంత పోయే విషయాలను చవిచూసిందని తెలిపారు.
చనిపోయిన యాదవ వీరుల ఘనీభవించిన మృతదేహాలు, అప్పటికీ వారి చేతుల్లో తుపాకీలను పట్టుకుని, వారి శరీరం లో ఛాతీపై బుల్లెట్ల గాయాలను కలిగి ఉన్నాయి అని గ్రహించడమైనదని,
యాదవుల శౌర్యం వలనే చైనా దురాలోచన ప్రయత్నాన్ని విజయవంతంగా ఆపడమే కాకుండా, చుషుల్ విమానాశ్రయాన్ని రక్షించకల్గింది, తద్వారా లడఖ్ ప్రాంతమంతా చైనా ఆక్రమించకుండా నిరోధించిందని తెలిపారు . వీరి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం భారత రక్షణ శాఖ రెజాంగ్లాలో అహిర్ ధామ్ ను నిర్మించారని అన్నారు.

జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు మాట్లాడుచూ… ఎందరో యాదవులు భారత దేశ రక్షణ కొరకు అనేక యుద్దాలలో యుద్దాలు చేసి భారత మాత ఒడిలో అమరులయ్యారని, వీరి త్యాగానికి గుర్తుగా యాదవ్ రెజిమెంట్ ను సాధించాకోవాలని, ఈ యాత్ర ముగిసే లోపు కేంద్ర ప్రభుత్వం యాదవ్ రెజిమెంట్ ను పునరుద్దరించాలని, లేకపోతే దశల వారీ గా ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.

జోన్ అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి యాదవ్ మాట్లాడుచూ…
స్వతంత్ర పోరాటంలోనూ, దేశ రక్షణ కోసం ఎన్నో ఏళ్లుగా ముందుండి పోరాడి త్యాగం చేసిన ( అహిర్ ) యాదవుల కోసం అహిర్ రెజ్మెంట్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని యాదవుల సౌర్య పరాక్రమాలు దేశ ప్రజలకు తెలియజేసి న్యాయమైన యాదవ రెజిమెంట్ డిమాండ్ తో ఒక లక్ష కిలోమీటర్ ల కలశ యాత్ర ను అఖిల భారత యాదవ మహాసభ నిర్వహిస్తోన్నదన్నారు.

కలశ యాత్ర కన్వీనర్ దత్తాత్రేయ మాట్లాడుతూ… ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన 8 యుద్ధాల్లో రెజంగ్లా యుద్ధం చాలా ప్రాముఖ్యత కలిగినది అని అన్నారు.

కార్పోరేటర్ నాగం వెంకట శేషయ్య మాట్లాడుచూ
114 మంది ధైర్యవంతులైన యాదవ రెజిమెంట్ కు చెందిన సైనికులు భారతమాత రక్షణలో అమరులయ్య వీరి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం భారత రక్షణ శాఖ రెజాంగ్లాలో అహిర్ ధామ్ ను నిర్మించారన్నారు .

ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్, కొత్తగొర్ల వెంకటేశ్వర్లు యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు శంకర్ యాదవ్, మల్లెబోయిన రాజు, పెద్దన్న యాదవ్, చెన్నుబోయిన మస్తాన్ రావు యాదవ్, కసిబిసి నాగేశ్వరరావు,ఆవుల రాధాకృష్ణ, పిగిలి శ్రీను,బొట్లా మాల్యాద్రి, కృష్ణ యాదవ్, ఆర్కే యాదవ్, బొడ్డు వేణు, బొబ్బాల భాను, మోడుబోయిన నాగేశ్వరరావు, పేరయ్య, రాజ్యలక్ష్మి, తో పాటు యాదవ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *