బేగంపేట జులై 29(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ నియోజకవర్గము తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బౌద్ధనగర్ లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. తెదేపా బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు గరిగె ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవేడుకల్లో తెదేపా నాయకులూ నాయకురాళ్లు పాల్గొని శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈకార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు వెంకటస్వామి, పొట్టిశ్రీను, చంద్రమోహన్, మురళికృష్ణ, చిరంజీవి రాజు, శేషిరెఖ, కట్టా రాములు, శ్రీనుయాదవ్, దేవేందర్, రాజు, శంకర్, సుధాకర్, డెంటల్ ప్రవీణ్, సాయిరాం, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

