ఫ్రీ మారిటల్ కౌల్సిలింగ్ కేంద్రం ఎంతో ఉపయోగం – జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా

వైవాహిక జీవితం ప్రారంభించే నూతన జంటలకు ఫ్రీ మారిటల్ కౌల్సిలింగ్ కేంద్రాలు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా పేర్కోన్నారు. జిల్లా స్పందన సమావేశపు మందిరంలో సోమవారం ఫ్రీ మారిటల్ కౌల్సిలింగ్ పోస్టర్స్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కౌల్సిలింగ్ కేంద్రాల వలన వివాహం చేసుకోబోయే జంటలకు వివాహం తర్వాత ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి . ఆర్థిక విసయాలు గురించి, ఒకరినొకరు అర్థం చేసుకునే అంశాల గురించి వివరింగా తెలుసుకుంటారని చెప్పారు. పిల్లల పెంపకం వంటి అంశాలపై ఏకాభి ప్రాయానికి రావటం వలన వివాహం తర్వాత వచ్చే ఇబ్బందులను సులభంగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ కౌల్సిలింగ్ వలన సంతోషకరమైన కుటుంబ వ్యవస్థ ఏర్పాటుకు ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ . స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సువర్ణ, డిఆర్ఓ చిన ఓబు లేసు, సఖి అడ్మిన్ జోఓ్యతి సుప్రియ, పీఎఫ్ఓ గౌతమి, లాయర్ స్పందన, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *