సినిమా సెట్టింగ్ అన్నదాత సుఖీభవ సభ – వైసిపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శ

అన్నదాత సుఖీభవ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమం సినిమా సెట్టింగ్ ను
తలపించేదే, తప్ప రైతుల కష్టాలు తీర్చేదిగా లేదని వైసిపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసిపి ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ… సూపర్ సిక్స్ హామీల అమలు పేరుతో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రైతుల కష్టాలు తీర్చేదిగా ఉందా? లేక రాజకీయ ప్రచారానికి వేదికగా మారిందా? అనిప్రశ్నించారు. ఆర్బికెల ద్వారా తమ ప్రభుత్వం గతంలో 58 లక్షల మందికి రైతు భరోసా అందింనట్లు తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం 46 లక్షల మందికి ఇస్తున్నారని విమర్శించారు. మిగిలిన 12 లక్షల మంది ఏమయ్యారని ఆయన
ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతి రైతుకు రూ.26 వేలు అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం, రూ 7 వేలు ఇచ్చినట్లు తెలిపారు. దశల వారీగా రూ.20 వేలు ఇస్తామని పేర్కొనడం మాట మార్చినట్లే కదా మార్చినట్టే కదా? అని అగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేక మిర్చి, పొగాకు రైతులు ఆందోళన చెందుతుంటే సూపర్సిక్స్ పథకాలంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం సిగ్గుగా లేదా అని ఆయన్న ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మిర్చి కింటాకు రూ.28 వేలకు అమ్ముడు పోయినట్లు తెలిపారు. ఇప్పుడు కేవలం రూ.6 వేలు కూడా వలకడం లేదన్నారు. తమ
ప్రభుత్వ హయాంలో పొగాకు ధర క్వింటా రూ 36 వేలు పలికినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ. 20 వేలకు మించి కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. దీపం పథకం లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, అన్నీ సినిమాల సెట్టింగులే!” అని ఎద్దేవా చేశారు. దర్శి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్, దర్శిలో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు పత్రికల ప్రకటనలకే పరిమితమయ్యాని మండిపడ్డారు. రైతు ముప్పరాజు శ్రీనివాసులు నివాసంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడులకు పాల్పడటం ఆటవిక చర్యగా తప్పు పట్టారు. దర్శిలో టిడిపి నాయకులు మట్టి మొదలు రేషన్ బియ్యం. మద్యం మాఫియాలతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు తాజాగా చేపల చెరువుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసిపి నగర అధ్యక్షుడు కఠారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *