బేగంపేట ఆగస్టు 8 జే ఎస్ డి ఎం న్యూస్ :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు శుక్రవారం గాజుల అలంకారం లో భక్తులకు దర్శనం ఇచ్చారు.మూడవ శుక్రవారం సందర్భంగా శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ,మాణిక్యాల అమ్మవార్లు గాజుల అలంకరణలో దర్శనం ఇవ్వడంతో అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు.
శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈ ఓ జీ.మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు.సాయంత్రం సమయంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయం భక్తులతో కిట కిట లాడింది.



