అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్……ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట ఆగస్టు 9 జే ఎస్ డి ఎం న్యూస్ :
అన్న, చెల్లెలు అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి పలువురు రాఖీలు కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయం వద్దకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతులు చేరుకొని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాఖీలు కట్టిన బ్రహ్మ కుమారీలు

రక్షాబంధన్ సందర్భంగా సికింద్రాబాద్ కు చెందిన బ్రహ్మ కుమారీలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి రాఖీ కట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *