నాగంబొట్ల పాలెంలో పోలేరమ్మ తల్లి కొలుపుల నందర్భంగా సోమవారం అమ్మవారికి గ్రామంలో మహిళలు సామూహిక పొంగళ్లు సమర్పించారు. వేకువ జాము నుండే మహిళలు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పెట్టి సామూహికంగా సాంప్రదాయ బద్దంగా పలు వాయిద్యాలతో గ్రామోత్సవంగా స్వాములతో కలిసి వెళ్లి మొక్కులు చెల్లించారు. గ్రామంలో పోలేరమ్మ తల్లి పొంగళ్లు సందర్భంగా గత ఎనిమిది రోజుల నుండి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామంలో భక్తి భావంతో సాంప్రదాయ పద్ధతులలో కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఇక మంగళవారం గ్రామంలో సామూహిక కుటుంబ బోజనాలు నిర్వహిస్తుండటంతో బంధు మిత్రుల రాకతో గ్రామంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు, బంధువులతో కళ కళ లాడుతున్నది.





