ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా యువతలో దేశ భక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జిల్లా అంతటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ అన్నారు.
ఒంగోలులోని ఎన్టిఆర్ కళా పరిషత్ భవనంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల్ మేరకు జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా యువతలో దేశ భక్తిని పెంపొందించడంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నదే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలితమే మనకు స్వాతంత్ర్యం రావడం జరిగిందని, వారిని పేరు పేరునా వారి త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనం మనకోసం బతుకుతూ దేశం కోసం మనం ఏమి చేస్తున్నాం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగస్వాములై దేశ భక్తిని, ఔనత్యాన్ని చాటుతూ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో జాతీయ పతాకంతో ర్యాలీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్దేశించిన షెడ్యుల్ ప్రకారం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ కార్యక్రమాలను ఆగస్టు ఈనెల 15 తేదీ స్వాతంత్ర్య దినోత్సవం వరకు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా దేశభక్తిని పెంపొందించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, మెప్మా పిడి శ్రీహరి, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు కుమార్, జాన్సన్, మెప్మా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




