ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాన్ యోజన -25 లో ఖరీఫ్ సాగు చేయు
పంటలలో చేపట్టవలసిన మేలైన యాజమాన్యంపై జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి వివి శేషమ్మ భూ సార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం వరి, కంది, మొక్కజొన్న, సజ్జ, మిరప పంటలలో విత్తనం వేసిన వద్ద నుండి కోత వరకు చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అందిస్తున్న పలు పథకాల గురించి వివరించారు. ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, విఏఏ లు ఎన్ వీ సాయి కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.
