బేగంపేట ట్రాఫిక్ ఏఎస్ఐ శ్యామలకు పదివేల రివార్డ్ అందించిన సిపి సీ వీ ఆనంద్

బేగంపేట ఆగస్టు 13,జే ఎస్ డి ఎం న్యూస్ :
ఇటీవల నగరం లోని సికింద్రాబాద్ జింఖానా మైదానం లో నిర్వహించిన అథ్లెటిక్స్ లో పాల్గొని బంగారు,వెండి పతకాలు సాధించి సత్తా చాటిన బేగంపేట ట్రాఫిక్ ఏఎస్ఐ శ్యామలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్ అభినందించారు.శ్యామల డిస్కస్ త్రో పోటీల్లో బంగారు పతకం,షాట్ పుట్ లో వెండి పతకం సాధించిన విషయం విదితమే. ఈ మేరకు శ్యామల సి పి నీ కలవగా ఆమెను అభినందించి రూ 10వేల నగదు రివార్డ్ ను అందజేశారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ నగర పోలీస్ కమీషనర్ సి.వి ఆనంద్ చేతుల మీదుగా రివార్డ్ తీసుకోవడం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్ లో నిర్వహించే పోటీలలో పాల్గొని పతకాల సాధనకు కృషి చేస్తానని అన్నారు.భవిష్యత్ లో ఇతర దేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు తన వంతు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు సి పి హామీ ఇచ్చినట్లు శ్యామల తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *