హైదరాబాద్ ఆగస్ట్ 13,
జే ఎస్ డి ఎం న్యూస్ :
డ్రగ్స్ వ్యతిరేక పోరాటం లో అందరూ భాగస్వాములు కావాలని మెట్రో ఎం డి ఎన్వీ ఎస్ రెడ్డి అన్నారు.కేంద్ర సామజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బుధవారం చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాలయంలో నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పిలుపు నిచ్చారు.అధికారులు, సిబ్బంది చేత ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతున్నట్టు పేర్కొన్నారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తామని ప్రతిజ్ఞలో తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామిని అవుతామని ప్రతిజ్ఞ చేయించారు.

