బేగంపేట ఆగస్టు 22 (జెఎస్ డిఎం న్యూస్) :
శ్రావణమాసం ఎంతో పవిత్రమాసం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం రాంగోపాల్ పేట డివిజన్ జీరా లోని శ్రీ సంతోషి మాతా దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ మాసంలో అమ్మవార్లకు మహిళలు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారని చెప్పారు. శ్రావణమాసం లో చివరి శుక్రవారం ను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ప్రేమ్ కుమార్, కె.కిషోర్, లక్ష్మీపతి, అరుణ్ గౌడ్, కుమార్ యాదవ్, జనార్దన్, రాజు తదితరులు ఉన్నారు.

