టిడిపి ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శాగం కొండా రెడ్డిని ఆపార్టీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి గురువారం పరామర్శించారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరు వైద్యశాలలో సుదీర్ఘ చికిత్స నిమిత్తం నివాసం వద్ద చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో విషయం తెలుసుకున్న డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య ప్రొఫైల్ ను పరిశీలించి తగిన జాగ్రత్త తీసుకుని రికవరీ పొందాలని ఆకాంక్షించారు. ఆయన కుమార్తె, కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోగ్య సేవలను అభినందించారు.
వెలుగు వారి పాలెంలో కార్యకర్తలకు పరామర్శ……. వెలుగు వారి పాలెంలో ఇటీవల వినాయక నిమర్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలో అందులో గాయపడ్డ టిడిపి కార్యకర్తలను పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (సమర), క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు తదితరులు ఉ న్నారు.

