జిల్లా నూతన కలెక్టర్ రాజా బాబు సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసినతమీమ్ అన్సారియా

రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్ల బదిలీలో బాగంగా ప్రకాశం జిల్లాకు నూతన కలెక్టర్ పి రాజా బాబు నియమితులైనారు. ఐఎఎన్-2013 బ్యాచ్ కు చెందిన రాజా బాబు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా
బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లాకు 39వ కలెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న తమీమ్ అన్సారియా గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా నియమితులైనారు. 2024 జూన్ 27న తమీమ్ అన్సారియా బాధ్యతలు ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్ గా పనిచేస్తూ పదోన్నతిపై జిల్లాకు వచ్చిన తమీమ్ అన్సారియా ప్రజా సమస్యలను నైపుణ్యంతో వేగవంతంగా పరిష్కరించారు. విద్యార్థులు, మహిళలు, అనాధలు, కార్మికుల సమస్యల పరిష్కారంలో , అభివృద్ధి వైపు పయనించేందుకు పలు ప్రాజెక్టుల ఏర్పాటులో ఆమె తనదైన ముద్ర వేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *