రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు రూ.22 లక్షల విలువైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పాటుపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీ ఇలా హామీలన్నీ ఏడాదిలోనే అమలు చేశామని, ఎన్నికల్లో చెప్పాo కాబట్టి, ఎన్ని కష్టాలున్నా అన్ని హామీలు అమలు చేస్తామని అన్నారు. ఆటో డ్రైవర్లకి దసరా నాడు రూ. 15 వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. నాడు జగన్ ఆటో డ్రైవర్లకి ఏడాదికి రూ.10 వేలిచ్చి, జరిమానాలు పేరుతో రూ.30 వేలు లాక్కున్నారు. సంక్షేమం పేరుతో జగన్ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా ప్రజల శ్రేయస్సుకే, జగన్ ఏం చేసినా అందులో మోసం, దోపిడీ ఉంటుందని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
