జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుంటి గంగా భవాని ఆలయ హుండీ ఆదాయాన్ని దేవదాయ శాఖ ఇన్పెక్టర్ జి.అనంతనారాయణ సమక్షంలో శుక్రవారం లెక్కించారు. ఈ ఏడాది గం గమ్మ తిరునాళ్ల ఏప్రిల్14 నుండి సెప్టెంబర్ 12 వరకు150 రోజులపాటు భక్తులు వేసిన కానుకలను లెక్కించగా రూ 6లక్షల82 వేల 765లుఆదాయం సమకూరి నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు .ఈ కా ర్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ కొసనాగురుబ్రహ్మాం, ఆలయ ఈవో జి.వాసుబాబు, శ్రీశ్రీ భ్రమరాంభిక సేవాసమితి, చీమకుర్తి దేవస్థాన సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
