స్వర్ణాంధ్ర 2047 జీరో ప్రాపర్టీ పీ-4 పై సచివాలయ ఉద్యోగులకు శిక్షణ

స్వర్ణాంధ్ర 2047 లో బాగంగా జీరో ప్రాపర్టీ పీ -4పై సచివాలయం మండల, మున్సిపాలిటిలో ఎంపిక చేయిన మాస్టర్ ట్రైనర్స్ మరియి సచివాలయ ఉద్యోగులకు స్థానిక అంబేడ్కర్ భవనంలో మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా అర్ధ గుణాంక ముఖ్య ప్రణాళికాధికారి ఎం స్వరూపారాణి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు కొత్తగా ప్రవేశ పెట్టిన మొబైల్ యాప్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ప్రణాళిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ యాప్ ద్వారా బంగారు కుటుంబాలు, మార్గదర్శి మధ్య సచివాలయ ఉద్యోగులు అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలని చెప్పారు. నిర్ణీత సమయంలో బంగారు కుటుంబాల అవసరాలు మార్గదర్శలకు తెలియజేయటం, మార్గదర్శలు చేసిన సహాయం బంగాకు కుటుంబాలకు అందించటం వంటి అన్ని వివరాలు మొబైల్యాప్ లో పొందు పరిచాలని చెప్పారు. సంతనూతల పాడు ప్రత్యేక అధికారి ఎస్ వరకుమార్ దర్శి నియోజక వర్గ ప్రత్యేక అధికారి ఎస్ జాన్సన్, జిల్లా పరిషత్ ఉప కార్యనిర్వానాధికారి బాలమ్మలు ముఖ్య అతిథిలుగా పాల్గొని జీరో ప్రాపర్టీ పీ-4 ప్రాముఖ్యత సచివాలయ స్థాయి ఉద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన బాధ్యతలు వివరించారు. కార్యక్రమంలో 573 మంది మండల, మున్సిపాలిటి సచివాలయ ఉద్యోగులు, నియోజక వర్గ యంగ్ ప్రొఫెషనల్స్, జిల్లా విజన్ మరియు నియోజక వర్గ విజన్ సభ్యులు, అర్థ గుణాంక శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *